Home  »  TV News  »  అప్పుని పోలీస్ స్టేషన్ నుండి విడిపించిన కళ్యాణ్!

Updated : Jul 9, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -143 లో... కావ్య వల్లే నేను పెద్ద ప్రాబ్లమ్ నుండి బయటపడ్డానని రాజ్ చెప్పగానే.. అందరూ అపర్ణని కోప్పడతారు. అలా ఏది నిజమో తెలియకుండా ఎలా పడితే అలా ఇష్టమొచ్చినట్లు మాట్లాడవద్దని అపర్ణని అంటుంది ఇందిరాదేవి.

మరొక వైపు కనకం, కృష్ణమూర్తి లు.. దుగ్గిరాల ఇంటినుండి బయటకు వచ్చి నేను చెప్పిన ఒక అబద్ధం వల్ల నా కూతురు ఆ ఇంట్లో ఎలా ఉందో చూడండి. అసలు అబద్ధం ఆడకూడదని కృష్ణమూర్తితో కనకం అంటుంది. మనం పోలీస్ స్టేషన్ కి వెళ్లి విషయం కోర్ట్ కి పోకుండా ఎస్సై  కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడుదామని కృష్ణమూర్తి అంటాడు. మరొక వైపు అప్పుకి కళ్యాణ్ ఫోన్ చేస్తే.. స్విచాఫ్ రావడంతో నేనే వాళ్ళింటికి వెళ్లి సర్ ప్రైజ్ ఇస్తానని కళ్యాణ్ అనుకొని అప్పు వాళ్ళింటికి వెళ్తాడు. కళ్యాణ్ వెళ్లేసరికి అప్పు ఇంట్లో వాళ్ళ పెద్దమ్మ తప్ప ఎవరు ఉండరు. అప్పు పోలీస్ స్టేషన్ లో ఉందని చెప్తే, మళ్ళీ వాళ్ళింట్లో వాళ్ళకి కళ్యాణ్ చెప్తే కావ్యకి ప్రాబ్లమ్ అవుతుందని అప్పు పెద్దమ్మ అందరూ పెళ్లికి వెళ్లారని కళ్యాణ్ కి చెప్తుంది. కానీ కళ్యాణ్ కి అప్పు వాళ్ళ పెద్దమ్మ తడబడుతూ మాట్లాడేసరికి.. ఏదో దాస్తుందని అర్థం అవుతుంది. మరొక వైపు కావ్య ఉల్లిపాయలు కట్ చేస్తూ కళ్ళకి నీళ్లు కారుతుంటే అపర్ణ అన్న మాటలకూ ఏడుస్తుందనుకొని.. కావ్యని బాధపడకని చెప్తుంది ధాన్యలక్ష్మి. నేనేం బాధపడట్లేదు ఉల్లిపాయలు కట్ చేస్తుంటే కళ్ళలో ఈ కన్నీళ్లు వస్తున్నాయని కావ్య చెప్తుంది. మరొక వైపు అప్పుని స్టేషన్ నుండి కళ్యాణ్ విడిపిస్తాడు. రాకేష్ తో కంప్లైంట్ వెనక్కి తీసుకునేల చేసి అప్పుని బయటకు విడిపిస్తాడు. ఇంత జరిగితే నాకు ఎందుకు చెప్పలేదు. బంతి ద్వారా నిజం తెలిసిందని కళ్యాణ్ అంటాడు. అప్పుని విడిపించినందుకు.. కనకం, కృష్ణమూర్తి ఇద్దరు కళ్యాణ్ కి కృతజ్ఞతలు చెప్తారు.

మరొకవైపు అపర్ణ దగ్గరికి సుభాష్ వచ్చి.. నువ్వు నిజం ఏంటో తెలియకుండా అందరిముందు కావ్యని తిట్టావ్. అందుకు నువ్వు కావ్య కి సారీ చెప్పాలని సుభాష్ అంటాడు. సారీ చెప్పనని అపర్ణ అంటుంది. థాంక్స్ అయినా చెప్పమని సుభాష్ అపర్ణని కావ్య దగ్గరికి తీసుకెళ్తాడు. అపర్ణ థాంక్స్ చెప్తుంది. మళ్ళీ తనని అవమానిస్తుంది. మరొక వైపు కావ్య దగ్గర డబ్బు లేదని గ్రహిస్తాడు రాజ్. నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్లినప్పుడు ఒక్క రూపాయి కూడా కావ్య దగ్గర లేదా? అలా ఎలా ఉంటుందని.. తన దగ్గర కొంత డబ్బు ఉంచాలని రాజ్ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.